జగన్ సర్కారుకు గుడ్‌న్యూస్‌.. కేంద్రం నుంచి పురస్కారం?

frame జగన్ సర్కారుకు గుడ్‌న్యూస్‌.. కేంద్రం నుంచి పురస్కారం?

Chakravarthi Kalyan
జగన్ సర్కారుకు కేంద్రం నుంచి ఓ గుడ్ న్యూస్‌ వినిపించింది. గనుల అన్వేషణ, వేలం, మైనింగ్ నిర్వహణలో అత్యుత్తమ విధానాలు అనుసరించినందుకు రాష్ట్ర గనుల శాఖకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ రాష్ట్రీయ ఖనిజ వికాస్ పురస్కారానికి ఎంపికైంది. ఈ అవార్డు ఇన్సెంటీవ్‌గా రూ. 2.40 కోట్లు పురస్కారాన్ని కేంద్ర గనుల శాఖ అందించింది.  


ఢిల్లీలో జరిగిన జాతీయ కాన్‌క్లేవ్‌లో ఈ పురస్కారాన్ని కేంద్ర మంత్రులు అమిత్‌ షా, ప్రహ్లాద్‌ జోషి అందజేశారు. కేంద్ర మంత్రుల నుంచి రాష్ట్ర గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, డిఎంజి విజి వెంకట రెడ్డి ఈ అవార్డు అందుకున్నారు. గనుల విషయంలో ఏపీ సర్కారు కొన్నేళ్లుగా అనేక మంచి ప్రాక్టీసులు అమలు చేస్తోంది. వీటి ఫలితంగానే ఈ అవార్డు దక్కిందని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు:

Unable to Load More