చంద్రబాబు డౌట్స్: ఆ లెక్కలు చెప్పు జగన్?

Chakravarthi Kalyan
ఏపీలో అసలు రాష్ట్ర ఆదాయం ఎటు పోతుందో తెలియడం లేదని ప్రతిపక్షనేత చంద్రబాబు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. అమర్నాథ్‌ యాత్రికులపట్ల జగన్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడాన్ని ఖండించారు. పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కు భద్రత పెంచాలని  టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు.


పాఠశాలల విలీనం ఉపసంహరించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. 51 వేల ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అన్నా క్యాంటీన్లు, చంద్రన్న బీమా, విదేశీ విద్య, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, పెళ్లి కానుకలు, పండుగ కానుకల లాంటి  100 సంక్షేమ కార్యక్రమాల్ని జగన్ రెడ్డి రద్దు చేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సబ్ ప్లాన్ నిధులు 35వేల కోట్లు దారి మళ్లించారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: