రసికుడే: పుతిన్ మళ్లీ తండ్రి కాబోతున్నాడా?

Chakravarthi Kalyan
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అనారోగ్యంపై ఆ మధ్య వరుసగా పుకార్లు వచ్చాయి. ఆయనకు క్యాన్సర్ వచ్చిందని..అది అడ్వాన్‌డ్‌ స్టేజ్‌లో ఉందని ప్రచారం జరిగింది. కానీ.. తాజాగా వస్తున్న ఓ వార్త మాత్రం అమ్మా పుతిన్.. ఏం తక్కువ వాడు కాదు సుమా అనిపించేలా ఉంది. అదేంటంటే.. పుతిన్ ఇప్పుడు 69 ఏళ్ల వయసులో మరోసారి ఓ బిడ్డకు తండ్రి కాబోతున్నాడట.

పుతిన్‌ ప్రేయసి, మాజీ జిమ్నాస్ట్‌ అలీనా కబయెవాకు ఆడపిల్ల పుట్టనుందని రష్యాలోని ఓ వార్తా సంస్థ వార్తా కథనం రాసింది. ఈ అలీనా ఒలింపిక్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ కూడా. ఆమెకు పుతిన్‌ వల్ల ఇప్పటికే ఇద్దరు కుమారులు, మరో ఇద్దరు కవల కుమార్తెలు కూడా ఉన్నారట. అయితే.. వీరి వివరాలు మాత్రం రహస్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఇక పుతిన్‌కు పాత భార్య లియుద్‌మిలాతో ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 37 ఏళ్ల మారియా ఫాసెన్‌ వ్యాపారవేత్తగా సక్సస్ అయ్యారు. ఇంకో కుమార్తె కేటెరినా టిఖోనొవా శాస్త్రవేత్తగా సక్సస్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: