ఏపీ సీఎం జగన్ 292 ఉన్నత పాఠశాలల్లో చదివే అమ్మాయిలకు గుడ్ న్యూస్ చెప్పారు. వారు ఇక పదో తరగతి తర్వాత కాలేజీ కోసం వేరే చోటకు వెళ్లాల్సిన పని లేదు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 292 ఉన్నత పాఠశాలలను హై స్కూల్ ప్లస్ గా మార్పు చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. ఈ హై స్కూల్ ప్లస్ పాఠశాలలను బాలికలకు ప్రత్యేకంగా కేటాయిస్తూ ఆదేశాలు ఇచ్చింది. హై స్కూల్ ప్లస్ పాఠశాలలలో ఎంపిసి, బైపిసి, సీఈసి లలో రెండు కోర్సులు అందించనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.
స్థానికంగా ఉన్న డిమాండ్ ను అనుసరించి కోర్సులు నిర్ధారించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీజిటి సమాన స్థాయి అధ్యాపకులనే బోధనకు తీసుకోనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. 1752 స్కూల్ అసిస్టెంట్ లను 292 జూనియర్ కళాశాలలలో పని చేసేందుకు నియమిస్తారు. ఆయా పాఠశాలల్లో నాడు నేడు పనులు చేపట్టిన దృష్ట్యా ఇక అదనపు తరగతి గదులను మంజూరు చేయబోరు.