
సొంత పార్టీ ఎంపీకి చుక్కలు చూపిస్తున్న జగన్..?
సాధారణంగా ఎక్కడైనా ప్రధాని కార్యక్రమం జరిగితే.. ఆ ప్రాంత ఎంపీని ఆహ్వానించడం ప్రొటోకాల్.. దీన్ని సాధారణంగా ఉల్లంఘించరు. కానీ.. ఎందుకో ప్రధాని మోదీ భీమవరం పర్యటన విషయంలో మాత్రం పీఎంఓ దీన్ని ఉల్లంఘించింది. అయితే.. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం తనపై పన్నిన కుట్రే అంటున్నారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు. మొత్తానికి ఎంపీ రఘురామ కృష్ణంరాజు సొంత నియోజక వర్గానికి రావడం కూడా గగనమైపోయిందన్నమాట.