హైదరాబాద్ క్రైమ్స్: రెచ్చిపోతున్నఆఫ్రికన్లు?
ఇలాంటి ఓ ఐదుగురిని వారి దేశానికి పంపిస్తున్నారు. ఎఫ్ఆర్ఆర్ఓ కి సమాచారం ఇచ్చి ఎంబసీ ద్వారా వారిని సొంత దేశాలకు పంపిస్తున్నామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్ లో ఉంటూ పలువురికి వీరు సమస్యలు గా మారుతున్నారని.. అందుకే కొంతమందిని పంపేందుకు తామే విమాన టికెట్లను కూడా బుక్ చేశామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్ లో 2500 మంది ఆఫ్రికన్లు ఉంటే అందులో వీసా గడువు ముగిసిన వారు 750కి పైగా ఉన్నారు. త్వరలో మిగిలిన వారికి కూడా ఇక్కడి నుంచి పంపిస్తామన్నారు.