
ఉక్రెయిన్ యుద్ధం: అమెరికాకు రష్యా బిగ్ షాక్?
ఇప్పుడు ఈ ఆంక్షలను రష్యా మరింత తీవ్రం చేసింది. ఇప్పుడు ఏకంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి, కుమార్తెను కూడా ఈ నిషేధిత జాబితాలో రష్యా చేర్చింది. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. రష్యా నేతలు, ప్రముఖులపై అమెరికా విధిస్తోన్న ఆంక్షలకు ఇది ప్రతిస్పందనగా తెలిపింది. తాజాగా 25 మంది అమెరికన్ పౌరులను స్టాప్ లిస్ట్ జాబితాలో చేర్చినట్టు రష్యా ప్రకటించింది.