అందమైన జంట.. అనుమానంతో ఎంత పని చేశాడు?

Chakravarthi Kalyan
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చి కాపురం ఉన్నారు. అన్యోన్యంగా జీవిస్తున్నారు. కానీ అనుమానం ఆ జంట మధ్య నిప్పులు చిమ్మింది. అనుమానం పెనుభూతంగా మారి ఇద్దరి ప్రాణాలనూ బలి తీసుకుంది. అస్సాంకు చెందిన మహానంద బిశ్వాస్‌, పంపా సర్కార్‌ ఏడాదిన్నర కిందట ప్రేమ పెళ్లి చేసుకున్నారు. జీవనోపాధి కోసం హైదరాబాద్ వచ్చారు.
సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తూ బతుకు బండి సాగిస్తున్నారు. పంజాగుట్ట సమీపంలోని ప్రేమ్‌నగర్‌లో అద్దెకు ఉంటున్నారు. బంజారాహిల్స్‌లోని మాల్‌లో కాపలాదారులుగా ఉద్యోగాలు చేస్తున్నారు. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త సోమవారం మధ్యాహ్నం భార్య పంపా సర్కార్‌తో గొడవపడ్డాడు. నిండుగా నీరున్న బకెట్‌లో ఆమె తల ముంచి చంపేశాడు. లక్డీకాపుల్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోని వంతెన వద్ద రైలు కింద పడి తానూ చనిపోయాడు. అతడి పాకెట్‌ డైరీలో అస్సామీ భాషలో ఆత్మహత్య లేఖ దొరికింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: