ఆ బూతు తట్టుకోలేం.. ఆపండి బాబోయ్‌?

Chakravarthi Kalyan
ఓటీటీ.. ఇప్పుడు వినోద రంగంలో ఇదో సంచలనం.. వెండి తెర ఇంటికే వచ్చేసిన సౌకర్యం ఇది. ఎలాంటి సినిమా అయినా.. ఓటీటీలోకి కొన్నిరోజుల్లోనే వచ్చేస్తోంది. థియేటర్లో రిలీజయ్యే సినిమాలే కాకుండా.. కేవలం ఓటీటీ కోసం కొన్ని వెబ్ సీరిస్‌లు తయారవుతున్నాయి. అయితే.. వీటిలో అశ్లీలత డోసు పెరుగుతోందన్న ఆందోళన ఉంది. ఓటీటీలకు సెన్సార్‌ నిబంధనలు ప్రస్తుతానికి వర్తించడం లేదు.
అందుకే వీటిలో బూతు శాతం పెరుగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా ప్రముఖ హీరో సుమన్‌.. ఓటీటీల్లో వచ్చే వెబ్‌ సిరీస్‌ల్లో అశ్లీలతపై స్పందించారు. ఈ ఓటీటీలపై కూడా సెన్సార్‌ బోర్డు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు సుమన్. కొవిడ్‌ నేపథ్యంలో రెండేళ్లగా ఓటీటీ ప్రభావం పెరిగిందని సుమన్ అన్నారు. ఇదే సమయంలో వాటిల్లో వస్తున్న వెబ్‌ సిరీస్‌ల్లో అశ్లీలత డోసు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటీటీలపై ఎటువంటి పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా తీస్తున్నారని సుమన్ విమర్శించారు. ఇది మంచి పద్ధతి కాదని.. ప్రభుత్వం, సెన్సార్‌ బోర్డు ఈ విషయమై దృష్టి సారించాలని సుమన్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

OTT

సంబంధిత వార్తలు: