ఆ హీరో ఎంత ట్రై చేసినా జగన్ కలవనివ్వలేదట?

Chakravarthi Kalyan
ఆయన మాజీ హీరో.. సీఎం జగన్‌ను కలుద్దామని రెండు, మూడు సార్లు ప్రయత్నించారట. కానీ.. సీఎం జగన్ అపాయింట్‌మెంట్ మాత్రం ఆ మాజీ హీరోకు లభించలేదట. ఇంతకీ ఆ హీరో ఎవరంటారా..ఆయనే సుమన్. ఆంధ్రాలో సినీ పరిశ్రమ అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయంటున్న సుమన్.. లోకేషన్లు, పోలీసు బందోబస్తు, త్వరితగతిన అనుమతి మంజూరు వంటి సదుపాయాలు కల్పిస్తే ఆంధ్రాలో చాలా మంది సినిమాలు తీయడానికి ముందుకు వస్తారని అంటున్నారు.
తాను ప్రస్తుతానికి ఏ పార్టీలోనూ లేనని సుమన్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కలిసేందుకు రెండు, మూడు సార్లు ప్రయత్నించానన్నారు. కానీ.. అపాయింట్‌మెంట్‌ దొరకలేదన్నారు. ఓటీటీ వెబ్‌ సిరీస్‌ల్లో అశ్లీలతపై సెన్సార్‌బోర్డు దృష్టి సారించాలని సినీ నటుడు సుమన్‌ అంటున్నారు. విజయవాడ పి.నైనవరంలో సుమన్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ ఆలిండియా అధ్యక్షుడు ధూళిపాళ్ల దేవేంద్ర భార్య నిర్మల మొదటి వర్థంతికి ఆయన వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: