అయ్యో.. ఆ బీచ్‌లో సరదాగా ఈతకు వెళ్తే..?

Chakravarthi Kalyan
బాపట్ల సూర్యలంక బీచ్‌లో తరచూ పర్యాటకులు ప్రాణాలు కోల్పోతున్నారు. సముద్రతీర ప్రాంతంలో పర్యాటకులకు ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నా పర్యాటకులు కాస్త అజాగ్రత్తగా ఉంటున్నారు. ఇటీవల సూర్యలంక సముద్ర తీర ప్రాంతంలో  తరుచుగా ఈతకు వెళ్లి అనేక మంది పర్యాటకులు మృత్యువాత పడుతున్నారు. సూర్యలంక ప్రాంతానికి వచ్చే పర్యాటకుల కోసం తుఫాన్ షెల్టర్ లో వైద్య సేవలు అందించేందుకు ప్రథమ చికిత్స కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రధమ చికిత్స కేంద్రంలో అత్యవసర మందులు, వైద్యులు అందుబాటులో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. సముద్ర ప్రాంతంలో ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి గజ ఈతగాళ్ళ ను ఏర్పాటు చేశామంటున్నారు. పర్యాటకులు సముద్ర స్నానాలకు వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇకపై ప్రమాదాలు జరగకుండా స్నానాలకు  వెళ్లిన పర్యాటకులకు ముందస్తు జాగ్రత్తలు తెలియజేయడానికి పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: