
ఏంటిది జగన్.. ఎస్సీ కుర్రాడిని చంపితే పాలాభిషేకాలా?
ఎస్సీ యువకుడ్ని అతి కిరాతకంగా చంపిన అనంతబాబుని హీరోగా కీర్తిస్తూ వైసీపీ ఊరేగింపు నిర్వహించడం దారుణం అన్నారు. దీన్ని చూశాక ఈ ప్రభుత్వంలో నిందితులకు రక్ష, బాధితులకు శిక్షేనని మరోసారి రుజువైందని లోకేశ్ విమర్శించారు. దళితుల్ని దారుణంగా చంపే వాళ్లకి ప్రమోషన్లే తప్ప సస్పెన్షన్లు ఉండవని జగన్ రెడ్డి తన పార్టీ లీడర్ల నుంచి కేడర్ వరకూ భరోసా ఇస్తు న్నారని లోకేశ్ మండిపడ్డారు.