వైసీపీ కేంద్రంలోని మోడీతో సత్సంబంధాలే మెయింటైన్ చేస్తున్నారు. అలాగని మరీ రాసుకుపూసుకు తిరగట్లేదు.. అలాగే పెద్దగా గొడవలూ పెట్టుకోవడం లేదు.. ఈ నేపథ్యంలో ఇటీవల కాస్త ఏపీలో బీజేపీ దూకుడు పెంచింది. వైసీపీ సర్కారుపై విమర్శలు పెంచింది. అదే నేపథ్యంలో.. వైసీపీ నేతలు కూడా మోడీ సర్కారుపై విమర్శలు చేస్తున్నారు. అయితే.. కేంద్రంలోని ఓ మంత్రి మాత్రం జగన్ పాలన అంటే బాగా మెచ్చుకుంటున్నారట. అందుకే నిధుల వరద పారిస్తున్నారట.
ఆ మంత్రి ఎవరో తెలుసా.. నితిన్ గడ్కరీ.. ఈ విషయాన్ని ఏపీ ఆర్ అండ్ బీ శాఖ మంత్రి దాడిశెట్టి చెబుతున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ పరిపాలనలో రోడ్లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని.. అందుకే కేంద్రంలో గడ్కరీ కూడా మెచ్చుకుని ఏ రాష్ట్రానికి ఇవ్వని రీతిలో నిధులు ఇస్తున్నారని అంటున్నారు. ఏపీలో రూ.2,205 కోట్లతో రహదారుల నిర్మాణాలు, మరమ్మతు పనులు జరుగుతున్నాయని దాడిశెట్టి రాజా చెప్పారు.