వాళ్లను ఆపండి: సీఎం జగన్‌కు లోకేశ్‌ లేఖ..?

Chakravarthi Kalyan
టీడీపీ నేత నారా లోకేశ్‌ ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు. కొన్ని జిల్లాల్లో రైతులు పంట విరామం పాటిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ లేఖ రాశారు. క్రాప్‌ హాలీడే ప్రకటించిన రైతులు ఆ ప్రకటన నుంచి విర‌మించేలా చ‌ర్యలు తీసుకోవాలని నారా లోకేశ్‌ సీఎం జగన్‌ను కోరారు. ఆ రైతులతో మాట్లాడి వారికి భరోసా ఇవ్వాలని నారా లోకేశ్‌ తన లేఖలో కోరారు. రైతుల్ని ఆదుకోవాలని.. వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  సీఎంకి లేఖ రాసారు.

క్రాప్‌హాలీడేలు ప్రక‌టించడం వ‌ల్ల రైతుల్లేని రాష్ట్రంగా ఏపీ మారుతోందని టీడీపీ నేత నారా లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. `ఈ`క్రాప్‌ బుకింగ్‌లో స‌మ‌స్యలు ఉన్నాయని.. రైతులకు సున్నా వడ్డీకి రుణాలు అంద‌ట్లేదని.. వ‌రికి మద్దతు ధర ద‌క్కట్లేదని.. నారా లోకేశ్ సీఎం జగన్ దృష్టికి తెచ్చారు. ఈ సమస్యలను పరిష్కరించాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: