టీడీపీ,
వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధాలే మామూలే కానీ.. ఈసారి
టీడీపీ మహిళా నేత వంగలపూడి
అనిత కూడా ఈ యుద్ధంలో చేరారు. జూమ్ లో చొరబడడం
తాడేపల్లి స్క్రిప్ట్ అని ముసలి నక్క విజయసాయిరెడ్డి మాటలతో అర్థమైందని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి
అనిత కామెంట్ చేశారు. విజయసాయి రెడ్డిని ముసలి నక్క అని చాలా మంది అంటారని... తాను పండు కోతి అంటానని ఆమె ఎద్దేవా చేశారు.
విజయ సాయి రెడ్డికి
విశాఖ మీద మోజు తీరిందని..
విజయవాడ మీద మోజు పెరిగిందని అంటున్నారని...., అది ఎలాంటి మోజు ఇక్కడి
వైసీపీ నేతలకే తెలియాలని
అనిత దుయ్యబట్టారు.
పదో తరగతి పరీక్షలపై తాను చర్చకు వస్తానని.. దమ్ముంటే ఎవరో వస్తారో రావాలని
అనిత సవాల్ విసిరారు. తాను ఒక్కదాన్నే చర్చకు వస్తానన్న అనిత... వైకాపా నాయకులు ఎంత మంది అయినా రావొచ్చని తెలిపారు.
వైసీపీ ఏం చేసినా ఎదుర్కొవడానికి
తెదేపా సిద్దంగా ఉందని..వైసీపీ సిద్దమేనా అని విజయసాయికి
అనిత సవాల్ విసిరారు.