ఔరా.. పది ఫలితాల్లో వండర్‌ సాధించిన ట్విన్స్?

Chakravarthi Kalyan
పదో తరగతి ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. చాలా మంది పిల్లలు 560కి పైగా మార్కులు సాధించారు. అయితే.. పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం కారుమంచి జడ్పీ జిల్లా ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్ధినులు మాత్రం ఓ వండర్ సృష్టించారు. వీరిద్దరూ కవల పిల్లలు.. కవల పిల్లలంటే ఒకేలా కనిపిస్తారు కదా.. కానీ వీరు సాధించిన వండర్ ఏంటంటే.. పరీక్షల ఫలితాల్లోనూ వీరు కవలలు అనిపించుకున్నారు. ఇద్దరూ ఒకే స్కోరు సాధించారు. పదవ తరగతి ఫలితాల్లో సమాన మార్కులు సాధించి ఈ సోదరీమణులు ప్రతిభ చూపారు. బొల్లేపల్లి స్వప్న, బొల్లేపల్లి స్వాతి  600 మార్కులకు గాను ఇద్దరూ 578 మార్కులే సాధించారు. తండ్రి ఆరేళ్ల క్రితమే చనిపోయినా.. తల్లి వీరిని కుట్టు మిషన్ కుడుతూనే చదివిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని కూడా వీరు 578 మార్కులు సాధించడం విశేషమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

ssc

సంబంధిత వార్తలు: