మంత్రి విడదల రజని ఆ పాప పేరెంట్స్‌కు న్యాయం చేస్తారా?

Chakravarthi Kalyan
చిన్నారి ఆరాధ్య మృతికి కారణాలను తెలియజేయాలంటూ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజనికి పాప తల్లిదండ్రుల విన్నవించుకుంటున్నారు. పాప చనిపోయి రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవని ఆరాధ్య తల్లిదండ్రులు వాపోతున్నారు. ఆడుకుంటూ తిరిగే పాపను చికిత్స కోసమని ప్రభుత్వాసుపత్రికి తీసుకొస్తే చంపేశారని ఆరాధ్య తల్లిదండ్రులు రోదిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని..పాప మృతికి కారణాలను తెలపాలని ఆరాధ్య తల్లిదండ్రులు కోరుతున్నారు. విచారణకు అక్కడి అధికారులనే నియమిస్తే అసలు వాస్తవం ఎలా బయటకు వస్తుందని ఆరాధ్య తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పలుమార్లు అధికారులను కలిసి విన్నవించినా ఎటువంటి స్పందన లేదు ఆరాధ్య తల్లిదండ్రులు అంటున్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి స్పందించాలంటూ మంత్రి విడదల రజినిని ఆరాధ్య తల్లిదండ్రులు వేడుకున్నారు. గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో చిన్నారి ఆరాధ్య చికిత్స పొందుతూ మరణించింది. ముఖంపై చిన్న పులిపిరి వంటి మచ్చ ఉంటే.. దాన్ని తొలగించుకునేందుకు పాపను జీజీహెచ్‌కు తల్లిదండ్రులు తీసుకొచ్చారు. అయితే ఆపరేషన్ సమయంలో జరిగిన నిర్లక్ష్యం వల్ల పాప కోమాలోకి వెళ్లి చనిపోయిందని పాప తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: