
భారత్ వీక్‌నెస్ బయటపెట్టిన అమెరికా నివేదిక?
ఇంటర్నెట్ క్రైమ్ కంప్లయింట్ సెంటర్ ఇచ్చిన గణాంకాల ఆధారంగా ఎఫ్‌బీఐ ఈ నివేదిక రూపొందించిందట. ఈ ఎఫ్‌బీఐ నివేదిక ప్రకారం 2021లో అమెరికాలో 4,66,501మంది సైబర్‌క్రైం బాధితులుగా నమోదు అయ్యారట. ఆ తర్వాత స్థానం బ్రిటన్‌ది. అక్కడ సైబర్ క్రైమ్ బాధితుల సంఖ్య 3,03,949గా ఉందట. ఆ తర్వాత స్థానాల్లో కెనడా, ఇండియా ఉన్నాయట. కెనడాలో 5788 మంది, భారత్‌లో 3131 మంది గతేడాది సైబర్ క్రైమ్ బారిన పడ్డారట. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సైబర్ క్రైం కేసులు నమోదవుతున్న కోణంలోనూ ఎఫ్‌బీఐ జాబితా రూపొందించింది. షాకింగ్ ఏంటంటే.. ఈ 20 దేశాల జాబితాలో పాకిస్థాన్, చైనా దేశాలు కూడా భారత్ తర్వాతే ఉన్నాయట.