వణికిస్తున్న మంకీ పాక్స్.. తెలంగాణ అలర్ట్?
ఇప్పటికే మంకీ పాక్స్ ప్రబలుతున్న దేశాలకు వెళ్లి వచ్చిన వారిని పరిశీలిస్తారు. అలాంటి వారి ఒంటిపై ఏవైనా దద్దుర్లు ఉంటే వారి ఆరోగ్యాన్ని గమనిస్తూ ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తన అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అనుమానితులు స్వచ్ఛంధంగా జిల్లా వైద్య అధికారులను సంప్రదించాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది. అనుమానితుల రక్త నమూనాలను తీసుకుని పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపనున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.