ఆయన ఓ ఉద్యమ నాయకుడు.. ఆ తర్వాత ఆయనకు
టీడీపీ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఏకంగా
పార్టీ తరపున సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన కూడా ఉత్సాహంగా పని చేశాడు. ఆ ఎన్నికల్లో గెలిచాడు. కానీ.. టీడీపీకి అంత సీన్ లేకుండా పోయింది. దీంతో ఆయన టీడీపీకి దూరమైపోయాడు.. ఇదంతా జరిగింది 2014లో.. ఇప్పుడు సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు 2022లో అంటే దాదాపు ఆరేళ్ల తర్వాత అదే
టీడీపీ సీఎం అభ్యర్థిని
వైసీపీ అధినేత వైఎస్
జగన్ పిలిచి మరీ
రాజ్యసభ సీటు ఇచ్చారు. ఆయనే ఆర్ కృష్ణయ్య. ఒకప్పుడు టీడీపీలో పని చేసిన వారిని పిలిచి మరీ
పార్టీ తరపున
ఎంపీ సీటు కట్టబెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. బీసీలకు పెద్ద పీట వేస్తున్నామని చెప్పుకునేందుకే
జగన్ ఈ ఎత్తుగడ వేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.