రూట్‌ మ్యాప్.. పవన్‌ ఏంటీ కామెడీ?

Chakravarthi Kalyan
ఏపీలో జనసేనకు బీజేపీతో పొత్తున్న సంగతి తెలిసిందే. కానీ.. ఈ రెండు పార్టీలు ఎలా ముందుకు పోవాలో మాత్రం ఇంకా నిర్ణయించలేదట.. అసలు ఏపీలో బీజేపీకి బలమే లేదు. ఇక జనసేన పవన్ కల్యాణ్‌ చరిష్మాను నమ్ముకున్న పార్టీ.. ఇలాంటి పార్టీ బీజేపీతో ఎందుకు జట్టు కట్టిందో అర్థం చేసుకోవచ్చు. కేంద్రం అండ ఉండే మంచిదన్న నమ్మకంతోనే ఈ జత కుదిరింది. అయితే.. తనకు ఇంకా రూట్‌ మ్యాప్ బీజేపీ నుంచి రాలేదంటారు పవన్ కల్యాణ్.
బీజేపీతో జనసేన కలిసే ఉందని, బీజేపీతో తమ సంబంధాలు అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు పవన్. మోదీ, అమిత్ షా అంటే తనకు ఎంతో గౌరవమని... రోడ్ మ్యాప్ పై సరైన సమయంలో స్పందిస్తామని అంటున్నారు. పొత్తు ఏదైనా ప్రజలకు ఉపయోగపడాలని జనసేనాని స్పష్టం చేశారు. తన వ్యక్తిగత లాభం కోసం ఎప్పుడూ పొత్తు పెట్టుకోలేదంటున్నారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థితి దిగజారిపోతుందంటున్నారు. ఏపీ భవిష్యత్ కోసం ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలని పవన్ అంటున్నారు. మరి ఆ రూట్ మ్యాప్ ఎప్పుడు వస్తుందో ఏమో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: