ఇద్దరు అమ్మాయిలతో ఎస్‌.ఐ.ప్రేమ.. చివరకు?

Chakravarthi Kalyan
ప్రేమ పేరుతో యువతులను వంచించిన చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎస్సై విజయ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇతగాడు ఇద్దరినీ ప్రేమించి ఓ యువతి మరణానికి కారణమయ్యాడు. చంద్రగిరి ఎస్.ఐ విజయ్ కుమార్ ను అరెస్టు చేసి పామిడి పోలీస్ స్టేషన్ లో మీడియా ముందు ప్రవేశపెట్టారు. తర్వాత రిమాండ్ కు  తరలించారు.

ఈ విజయ కుమార్‌ మొదట ఓ యువతిని ప్రేమించాడు.. వెంటపడి మోజు తీర్చుకుని వదిలేశాడు. ఆమె దిశ పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించడంతో ఇక తప్పేదిలేదని పెళ్లి చేసుకున్నాడు. కానీ అప్పటికే మరో యువతితోనూ ప్రేమ కలాపం నడుపుతున్నాయి. ఆమె పెళ్లి చేసుకోమని బలవంతం చేసే సరికి అసలు విషయం చెప్పాడు. దీంతో ఆ అమ్మాయి మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. విజయ్ కుమార్ నాయక్  ను చంద్రగిరి లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొదట అనంతపురం జిల్లా గుత్తి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ప్రాథమిక విచారణ అనంతరం విజయ్ కుమార్ నాయక్ ను పామిడి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: