ఇండియాలో కరోనాతో ఇన్ని లక్ష మంది చనిపోయారా?

Chakravarthi Kalyan
కొవిడ్ మహమ్మారి ఇండియాపై పెను ప్రభావం చూపింది. వైరస్‌ సోకి ఇప్పటికే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వైద్య సదుపాయాలు అందుబాటులో లేక, లాక్‌డౌన్లతో లక్షల సంఖ్యలో ప్రజలు మణించారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది. కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా రెండేళ్ల కాలంలో కోటిన్నర మంది ప్రాణాలు కోల్పోతే ఒక్క ఇండియాలోనే కొవిడ్ కారణంగా 47లక్షల మంది చనిపోయారట. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక వెల్లడించింది. అంటే.. ఈ లెక్కల ప్రకారం కేంద్రం చెబుతున్న అధికారిక గణాంకాలతో పోలిస్తే దాదాపు పదిరెట్లు
ఎక్కువగా మరణాలు సంభవించాయన్నమాట. ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మరణాల్లో మూడింట ఒకవంతు భారత్‌లోనే నమోదైనట్లు WHO చెబుతోంది. అయితే దీన్ని ఇండియా ఖండించింది. డబ్ల్యూహెచ్‌ఓ లెక్కల తీరును తప్పుబట్టింది. అయితే WHO మాత్రం తాను  జాన్‌ హాప్‌కిన్స్ యూనివర్సిటీ గణాంకాలతో పాటు స్టాటిస్టికల్ మోడలింగ్ ద్వారా ఈ అంచనాలు వేసినట్టు చెబుతోంది. కరోనాతో ఆగ్నేయ ఆసియా, ఐరోపా..., అమెరికాలోనే ఎక్కువ మరణాలు సంభవించాయని WHO  పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: