అణు యుద్ధంపై రష్యా సంచలన ప్రకటన?

Chakravarthi Kalyan
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం అణు యుద్దానికి దారి తీస్తుందా.. ఇది ప్రపంచ దేశాలను పీడిస్తున్న ప్రశ్న. ఇప్పుడు దీనిక రష్యా చెప్పిన సమాధానం ప్రపంచాన్ని పెను ఆందోళనలో పడేస్తోంది. ఇప్పటికే రష్యా అణ్వాయుధ క్షిపణులను పరీక్షించింది. తద్వారా ఉక్రెయిన్‌ సహా పశ్చిమ దేశాలకు గట్టి హెచ్చరికలు పంపింది. ఇక ఇప్పుడు మరో సంచలన ప్రకటన చేసింది. తాము అణ్వస్త్ర సామర్థ్యం గల క్షిపణి దాడులపై సాధన చేస్తోన్నట్లు స్వయంగా వెల్లడించింది. 100 మందికిపైగా వ్యూహాత్మక దళాలతో అణ్వాయుధాల వాడకంపై మాక్‌ డ్రిల్‌ నిర్వహించినట్లు రష్యా ప్రకటించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక అణ్వయుధ నిల్వలున్న దేశాల్లో రష్యా ఒకటి. అలాంటి రష్యా ఈ అణు హెచ్చరికలు చేయడం యుద్ధ భయాన్ని రెట్టింపు చేస్తోంది. రష్యాలోని కలినిన్‌గ్రాడ్‌లో తమ దళాలు అణు సామర్థ్యం గల. క్షిపణి దాడుల ట్రయల్స్‌ నిర్వహిస్తున్నట్లు రష్యా చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: