షాకింగ్‌: పుతిన్‌కు ఆపరేషన్‌..వేరొకరికి అధికారం?

Chakravarthi Kalyan
ఉక్రెయిన్‌ పై యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నలుగుతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ క్యాన్సర్ శస్త్ర చికిత్సకు సిద్ధమయ్యారా.. ఆయనకు కీలకమై ఆపరేషన్‌ చేయబోతున్నారా.. అందువల్ల ఆయన పదవి నుంచి తాత్కాలికంగా వైదొలగి.. వేరొకరికి బాధ్యతలు అప్పగిస్తున్నారా.. ఈ ప్రశ్నలకు సమాధానం అవుననే వస్తోంది. పుతిన్ తాత్కాలికంగా తన అధికారాన్ని రష్యా నిఘా సంస్థ కేజీబీ మాజీ చీఫ్ నికోలాయ్ పాత్రుషెవ్ కు పుతిన్ అప్పగిస్తారట. ఈ పాత్రుషెవ్‌ రష్యా భద్రతా మండలి కార్యదర్శిగా ఉన్నాడు. ఈయన యుద్ధ వ్యూహాలు రూపొందించడంలో దిట్ట. ఉక్రెయిన్ పై యుద్ధం కోసం పుతిన్ ను ఈయనే ఒప్పించినట్లు చెబుతారు. పుతిన్‌కు క్యాన్సర్ సర్జరీ చేయాల్లి ఉంది. పుతిన్ ఏడాదిన్నరగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. పొట్ట క్యాన్సర్ కు తప్పనిసరిగా చేయించు కోవాల్సిన సమయం రావడం వల్ల పుతిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: