కరోనా కాలంలో కాస్త వెలవెలబోయిన ఇండియా ఆదాయం ఇప్పుడు బాగా పుంజుకుంది. మన దేశంలో పన్ను వసూళ్లు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం తొలినెల ఏప్రిల్‌లో వస్తు సేవల పన్ను అంటే జీఎస్టీ వసూళ్లు ఆల్ టైమ్ హై ను నమోదు చేశాయి. ఏప్రిల్‌లో దాదాపు లక్షా 68వేల కోట్లు వసూలైనట్లు కేంద్రం ప్రకటించింది. గతేడాది ఇదేకాలానికి వసూలైన మొత్తం కంటే 20 శాతం ఎక్కువ. మార్చిలో వసూలైన జీఎస్టీ మొత్తం కంటే...ఇది 26వేల కోట్ల అధికమం. ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్లు ఆదాయం లక్షా 57వేల 540 కోట్లు. అందులో సీజీఎస్టీ వసూళ్ల రూపంలో 33వేల 159 కోట్లు, ఎస్‌జీఎస్టీ వసూళ్లు 41వేల 793కోట్లు, దిగుమతుల ద్వారా పన్ను వసూళ్లు 36వేల 705కోట్లు ఉన్నాయి. ఐజీఎస్టీ వసూళ్లు IGST 81వేల 939 కోట్లు. దిగుమతి సెస్సు 857కోట్లు. మొత్తం సెస్ ఆదాయం 10వేల 649 కోట్లు. ఏప్రిల్ లో కోటీ 6వేల రిటర్న్స్ దాఖలయ్యాయి. డేటా అనలటిక్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఎగవేతదారులను గుర్తిస్తున్నారు. దీంతో జీఎస్టీ వసూళ్లు పెరిగాయంటోంది కేంద్రం.