ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కలిశారు. ఆయన దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డితో కలసి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం ను కలిశారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై సీఎం వైయస్ జగన్‌తో వారు చర్చించారు. గౌతం రెడ్డి మరణం తర్వాత ఆయన గత ఎన్నికల్లో గెలిచిన ఆత్మకూరు సీటును విక్రం రెడ్డికి ఇవ్వాలని మేకపాటి కుటుంబం ప్రతిపాదిస్తోంది. ఇందుకు సీఎం కూడా సుముఖంగానే స్పందించినట్టు తెలుస్తోంది. అలాగే ఇటీవల నెల్లూరు జిల్లాలోని ఓ ప్రాజెక్టుకు గౌతంరెడ్డి పేరు కూడా పెట్టారు. ఇందుకు సీఎంకు మేకపాటి కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. అలాగే మేకపాటి గౌతంరెడ్డి విద్యాసంస్థలను ప్రభుత్వానికి ఇస్తామని మేకపాటి గౌతంరెడ్డి పేరిట వర్సిటీ ఏర్పాటు చేయాలని కూడా గతంలో కోరారు. దానిపైనా చర్చించినట్టు సమాచారం.