వామ్మో.. ఒసామా కుట్ర అమలైతే.. ఎంత మారణహోమమో?

Chakravarthi Kalyan
ఒసామా బిన్‌ లాడెన్‌ ఎంత కరడు కట్టిన ఉగ్రావాదో తెలుసు కదా. 20 ఏళ్ల క్రితం ట్విన్‌ టవర్లపై దాడి చేశాడు. అమెరికాకు కంటిమీద కునుకు లేకుండా చేశాడు. అయితే.. ఉగ్రవాది బిన్‌ లాడెన్‌ మరో భీకర దాడికి కూడా పథకం రచించాడట. అయితే లక్కీగా దాన్ని అమలు చేయలేదు. ఈ విషయం ఇటీవల అమెరికన్ నేవీ సీల్‌ భద్రపర్చిన కీలక పత్రాల్లో వెల్లడైంది. లాడెన్‌ హతమైన అనంతరం లభించిన కీలక పత్రాలను అమెరికా నేవీ భద్రపర్చింది. ఆ పత్రాల్లో కొన్ని సంచలన విషయాలు బయటపడినట్లు తాజాగా ఓ పత్రిక కథనం వెలువరించింది. ఈ దాడికి ఛార్టర్ విమానాలను ఉపయోగించాలని ఒసామా భావించాడట. అది కుదరకపోతే అమెరికా రైల్వేలను లక్ష్యంగా చేసుకోవాలని ప్లాన్ చేశాడట. రైల్వే ట్రాక్‌లను లక్ష్యంగా చేసుకుంటే వందల మంది మరణించేవారు. అయితే ఒసామా ఈ ప్లాన్ అమలు చేయకుండానే మరణించడం అమెరికా చేసుకున్న అదృష్టంగా చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: