ఏపీలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే జగన్ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు. పార్టీ నేతలను రంగంలోకి దించుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తున్నారు. తాజాగా ఆయన ఓ ప్లాన్ రెడీ చేశారు. ఇక చంద్రబాబు ఎక్కువగా జనంలోనే ఉంటారు. మే మొదటి వారం నుంచి పూర్తిస్థాయిలో చంద్రబాబు పర్యటనలు ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ నిర్వహిస్తున్న ‘బాదుడే బాదుడు’ కార్యక్రమాన్ని మే మొదటి వారం నుంచి ఉధృతం చేస్తారు. దీన్ని చంద్రబాబు కుప్పంలో చేపడతారు. అలాగే మేలోనే వివిధ ప్రాంతాల్లో చంద్రబాబు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక మహానాడు తర్వాత ప్రతి 15 రోజులకి ఒక్క జిల్లాలో పర్యటించబోతున్నారట. దీనికి చంద్రబాబు ప్రణాళిక రెడీ చేసుకున్నారట. ఇకపై ప్రతి నెలా రెండు జిల్లాలు చొప్పున ఏడాదిపాటు రాష్ట్రమంతా తిరగాలని చంద్రబాబు ప్లాన్ చేసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.