నేటి నుంచి పవన్ కల్యాణ్‌ యాత్ర?

Chakravarthi Kalyan
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి జనంలోకి వెళ్తున్నారు. కౌలురైతు భరోసా యాత్ర పేరిట రాయలసీమలో పర్యటించనున్నారు. అనంతపురం జిల్లా కొత్తచెరువు నుంచి ఆయన కౌలురైతు భరోసా యాత్ర ప్రారంభించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఈ యాత్రలో పవన్ కల్యాణ్ పరామర్శిస్తారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆయన లక్ష  రూపాయల చచొప్పున ఆర్థిక సాయం ఇవ్వనున్నారు.

అనంతపురం జిల్లాలోని కొత్తచెరువు, గొట్లూరు, పూలకుంట, మన్నీల ప్రాంతాల్ల ఇవాళ పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఈ యాత్రలో భాగంగా మన్నీలలో  పవన్ కల్యాణ్ రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తారు. రైతులతో ముఖాముఖి మాట్లాడతారు. రైతుల కష్ట సుఖాలు పంచుకోనున్నారు. కౌలు రైతుల కుటుంబాలను ఆదుకుంటామని ఇటీవల పవన్ కల్యాణ్ తాజా పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఇందుకు తన వంతుగా రూ. 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. నాగబాబు కూడా తన వంతు విరాళం ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: