వచ్చే ఎన్నకల్లో వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదంటున్నారు పవన్ కల్యాణ్..అందుకే ఆ పార్టీ గురించి ఎక్కువగా ఆలోచించవద్దని జనసేన కార్యకర్తలకు చెబుతున్నారు. అధికారులు, పోలీసులు కూడా చట్టప్రకారం, నిబంధలన మేరకు పని చేయాలని వార్నింగ్ ఇచ్చారు. 2024లో అధికారంలోకి రాని పార్టీ కోసం తపన పడొద్దని అధికారులు, పోలీసులకు పవన్ కల్యాణ్ హితవు పలికారు. జగన్ నియంతృత్వ పాలన కారణంగా వచ్చే ఎన్నికలలో వైసిపి అధికారంలోకి రాదని పవన్ తేల్చి చెప్పారు. కౌలు రైతుల కోసం ఈనెల 12న అనంతపురం జిల్లా నుంచి జనసేన రైతు భరోసా యాత్ర ప్రారంభిస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు. ఇక పెట్రో ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. బిజెపితో పొత్తు ఉంది కాబట్టి ప్రతి దాన్ని సమర్థించేది లేదంటున్నారు పవన్ కల్యాణ్. మరి పవన్ జోస్యం నిజమవుతుందా.. వైసీపీ ఓడిపోతుందా?