ఏపీలో జనాభాలో పెద్ద, చిన్న జిల్లాలు ఇవే?

Chakravarthi Kalyan
ఏపీలో కొత్త జిల్లాలు ప్రారంభం అయ్యాయి. ఉన్న 13 జిల్లాలకు తోడు మరో 13 జిల్లాలు ఏర్పాటయ్యాయి. జిల్లాల విభజన కారణంగా పాత లెక్కలు మారిపోయాయి. జిల్లాల స్వరూప స్వభావాలను బట్టి మారిన ఈ అంశాలు ఆసక్తిగా ఉన్నాయి. ఇప్పుడు ఏపీలో అతి ఎక్కువ జనాభా ఉన్న జిల్లా ఏంటో తెలుసా.. నెల్లూరు జిల్లా..
మరి అతి తక్కువ జనాభా ఉన్న జిల్లా ఏంటో తెలుసా.. బాపట్ల జిల్లా.. అలాగే రాష్ట్రంలో విస్తీర్ణంలో అతి పెద్ద జిల్లా గా ప్రకాశం నిలిచింది. అతి చిన్న జిల్లాగా విశాఖ పట్నం నిలిచింది. జనాభా పరంగా అతి పెద్ద జిల్లా గా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నిలవగా.. అతి చిన్న జిల్లాగా బాపట్ల ఉంది. జనసాంద్రత విషయానికి వస్తే. అతి ఎక్కువ జనసాంద్రత ఉన్న జిల్లాగా విశాఖ పట్నం నిలిచింది. తక్కువ జనసాంద్రత ఉన్న జిల్లాగా ప్రకాశం నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: