వైసీపీ ప్రొడక్షన్స్: ఓ అత్యద్భుతమైన సినిమా?

Chakravarthi Kalyan
టీడీపీ నేత నారా లోకేష్ మరోసారి జగన్ సర్కారుపై విరుచుకుపడ్డారు. ఏప్రిల్ ఒకటి సందర్భంగా వినూతన్నంగా విమర్శించారు. ఎన్నికల హామీల విషయంలో రాష్ట్ర ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ ఫూల్ చేశారని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రొడక్షన్స్ సమర్పించు ఓ అత్యద్భుతమైన సినిమా అంటూ ఓ వీడియోను లోకేశ్ విడుదల చేశారు. జనo చెవిలో జగన్ పూలు పెట్టారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీల తగ్గింపు, మద్యనిషేధం హామీ, ప్రత్యేక హోదా సాధన, సన్నబియ్యం పంపిణీ హామీలు అన్నీ ఏప్రిల్ ఫూల్ అంటూ నారా లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాజధాని అమరావతి, వారం రోజుల్లో సీపీఎస్ రద్దు హామీలు విస్మరించిన తీరును విమర్శిస్తూ నారా లోకేశ్  నాలుగున్నర నిమిషాల వీడియోను నారా లోకేశ్ విడుదల చేశారు. బాదుడే బాదుడు బై జగన్ అని నారా లోకేశ్ ఎద్దేవా చేసారు. ఈ పోస్టును టీడీపీ వైరల్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: