మాట తప్పిన రష్యా.. మళ్లీ బాంబుల వర్షం..?

Chakravarthi Kalyan
ఉక్రెయిన్‌తో చర్చలు జరుపుతున్న సమయంలో దాడులు తగ్గిస్తామంటూ ప్రకటించిన రష్యా ఆ మాట తప్పింది. ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల మోత కొనసాగిస్తోంది. సైనిక కార్యకలాపాలు తగ్గిస్తామని చెప్పిన తర్వాత మళ్లీ మాట మార్చిన రష్యా దాడులు కొనసాగిస్తోంది. కీవ్‌, పరిసర ప్రాంతాలపై రష్యా సేనలు మళ్లీ బాంబులతో విరుచుకుపడుతున్నాయి. కీవ్‌ సహాఇతర ప్రాంతాలపైన దాడుల తీవ్రత పెరిగిందని ఉక్రెయిన్‌ ఆవేదన వ్యక్తం చేసింది.

కీవ్‌, చెర్నిహివ్‌ సమీపంలో దాడులు ఆపుతామని ఇటీవలే ప్రకటించిన రష్యా.. దాడులు ఆపుతామని ప్రకటించిన కొద్ది గంటల్లోనే మళ్లీ బాంబుల వర్షం కురిపించింది. ఇజియం, డొన్మెట్క్స్‌ నగరాల చుట్టూ రష్యా తన సైన్యాన్ని మోహరించింది. అయితే రష్యాపై తన శక్తి మేరకు ఉక్రెయిన్‌ ఎదురు దాడి చేస్తోంది. రష్యా భూభాగంలోని ఆయుధ డిపోపై ఉక్రెయిన్‌ దాడి చేసింది. బాలిస్టిక్ క్షిపణితో ఉక్రెయిన్ దళాల దాడిలో ఆయుధ డిపో ధ్వంసం అయినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: