చిత్తూరు జిల్లాలో ఘోరం: లోయలో పడ్డ పెళ్లి బస్సు?

Chakravarthi Kalyan
చిత్తూరు జిల్లాలో ఘోరం జరిగింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట సమీపంలోని ఓ లోయలో పెళ్లి బస్సు బోల్తా పడినట్టు సమాచారం వస్తోంది. ఈ ప్రమాదంలో 40 మందికి తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది. వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. అనంతపురం నుంచి తిరుపతికి నిశ్చిత్తార్థానికి వెళ్తుండగా ఈ  ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పెళ్లి బస్సు సుమారు 150 అడుగుల లోయలో పడినట్టు స్థానికులు చెబుతున్నారు.

విషయం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని సహాయ చర్యలు అందిస్తున్నారు. అయితే.. ఘటనాస్థలిలో చీకటి కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ప్రమాదం జరిగిన సమయంలో పెళ్లి బస్సులో 60 మంది వరకూ ఉన్నట్లు గాయపడిన వారు చెబుతున్న సమాచారం. క్షతగాత్రులను అంబులెన్స్‌లో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: