కేంద్రంపై సమర శంఖం పూరించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఓ కేంద్ర మంత్రిపై షాకింగ్స్ కామెంట్స్ చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తెలంగాణకు సహకరించట్లేదున్న కేసీఆర్.. ఈ విషయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పక్కా వ్యాపారిలా మాట్లాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రం సేకరణకు ముందుకొస్తే రాష్ట్ర ప్రభుత్వపరంగా సహకరించేందుకు ముందుకొస్తామని తెలిపినా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటోందని.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తాను పక్కా వ్యాపారినని నిరూపించుకుంటున్నారని కేసీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పీయూష్ గోయల్ తీరుపై మండిపడ్డ ఆయన గోయల్.. రైతులపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని... క్షేత్రస్థాయిలో పొలాల్లోకి వచ్చి చూస్తే పరిస్థితి తెలుస్తుందని మండిపడ్డారు. ఇదే సమయంలో మంత్రులు కూడా పీయూష్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం రైతులపై పూర్తి నిర్దయతో ఉందని... కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్ మానవత్వం కూడా మరిచి మాట్లాడుతున్నారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసారు.