చంద్రబాబు పాలనపై పుస్తకం తెచ్చిన వైసీపీ?

Chakravarthi Kalyan
ఆత్మ స్తుతి - పరనింద.. ఇప్పుడు ఇది రాజకీయాల్లో చాలా కామన్ అయ్యింది. తాము చేసిందంతా సూపర్.. తమ ప్రత్యర్థి చేసిందతా వేస్ట్.. ఇదీ ఇప్పుడు ఏ పార్టీ అయినా ప్రచారం చేస్తున్న తీరు.. అయితే సొంత డబ్బా.. లేకుండా ఎదురు దాడి.. ఈ రెండు మార్గాలే ఇప్పుడు పార్టీల ప్రయారిటీ లిస్టులో ఉన్నవి.. తాజాగా వైసీపీ కూడా అదే పని  చేసింది. చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఓ పుస్తకం రూపొందించింది. మాజీ సీపీఆర్వో విజయ్‌కుమార్‌ ‘ఐదేళ్ల అమావాస్య చంద్ర పాలన’ అనే  పుస్తకాన్ని రాశారు. దీన్ని సచివాలయంలో అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబులు తదితరుల ఆవిష్కరించి ప్రతులు పంచారు. ఈ పుస్తకం రచించిన మాజీ సీపీఆర్వో విజ‌య్‌కుమార్‌ను స్పీక‌ర్‌, మంత్రులు, తదితరులు శాలువాలతో  స‌న్మానించారు. వైసీపీ గతంలోనూ ఇలాంటి ప్రయత్నాలు చేసింది. నారాసుర రక్త చరిత్ర అంటూ గతంలోనూ పుస్తకాలు వేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: