సికింద్రాబాద్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. టింబర్ డిపోలో అగ్నిప్రమాదం కారణంగా మంటలు చెలరేగి ఐదుగురు సజీవంగా దహనం అయ్యారు. మంటల్లో కాలిబూడిదయ్యారు. సికింద్రాబాద్ బోయగూడలోని టింబర్ డిపోలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఈ టింబర్ డిపోలో మొత్తం పది మంది వరకూ కార్మికులు ఉన్నట్టు భావిస్తున్నారు. మంటలు అంటుకున్నప్పుడు మొత్తం టింబర్ డిపోలో 10 మంది కార్మికులు ఉంటే.. వారిలో ఐదుగురు మరణించారు. అయితే.. టింబర్ డిపోలో ఇంకా భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. మరో ఐదుగురు కూడా మంటల్లోనే చిక్కుకున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇదే టింబర్ డిపోలో పని చేస్తున్న మరో ఇద్దరు మాత్రం మంటల నుంచి సురక్షితంగా బయటపడినట్టు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పుతున్నారు.
సికింద్రాబాద్ బోయగూడలో జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదానికి గల కారణం మాత్రం ఇంకా తెలియరాలేదు.