గుడ్‌ న్యూస్: ఏపీలోనూ ఆ ఉద్యోగాలకు లైన్ క్లియర్‌?

Chakravarthi Kalyan
కొన్ని రోజుల క్రితం తెలంగాణలో సీఎం కేసీఆర్ ఉద్యోగాల గురించి అసెంబ్లీలోనే ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణలో ఉద్యోగాల కోసం పోటీపడేందుకు నిరుద్యోగులు సిద్ధం అవుతున్నారు. తెలంగాణలో గ్రూప్‌ 1,2 లతో పాటు అనేక రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాబోతున్నాయి. అయితే.. ఇప్పుడు ఏపీలోనూ గ్రూప్స్ పోస్టుల భర్తీకి సీఎం వైఎస్ జగన్ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చేశారు.

జాబ్ క్యాలెండర్ పోస్టుల కంటే అధికంగా భర్తీకి ఏపీ ప్రభుత్వం అనుమతి  ఇచ్చేసింది. అదనంగా గ్రూప్ 1 , గ్రూప్ 2 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. 110 గ్రూప్ 1 పోస్టులు, 182 గ్రూప్ 2 పోస్టుల భర్తీ కానున్నాయి. త్వరలో నోటిఫికేషన్లు ఏపీపీఎస్సీ జారీ చేయనుంది. ఇక గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్లు, ఆర్టీవో, సీటీవో, డీఎస్పీ, డీఎఫ్ఓ,మున్సిపల్ కమిషనర్‌లు, ఎంపీడీవో పోస్టులు భర్తీ చేస్తారు.  గ్రూప్ 2లో డిప్యూటీ తహశీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్‌లు, ట్రెజరీ పోస్టుల భర్తీ చేస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: