ఏపీ 10 వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల!

Purushottham Vinay
ఇక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను ఆంధ్ర ప్రదేశ్ ఎస్ఎస్‌సీ బోర్డు విడుదల చేయడం జరిగింది. కాగ గతంలోనే షెడ్యూల్ ను రిలీజ్ చేయగా..జేఈఈ మెయిన్స్ ఇంకా అలాగే ఇంటర్ పరీక్ష కారణంగా పదో తరగతి పరీక్షల షెడ్యూల్ లో స్వల్ప మార్పులు కూడా చేసింది. దీంతో కొత్త షెడ్యూల్ ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాసేపటి క్రితం రిలీజ్ చేసింది. ఈ కొత్త షెడ్యూల్ ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 27వ తేదీ నుంచి స్టార్ట్ కానున్నాయి.అలాగే మే 9 వ తేదీతో పదో తరగతి పరీక్షలు పూర్తి కానున్నాయి.


కాగ ఏప్రిల్ 27 వ తేదీన తెలుగు పరీక్ష ఉండనుంది. అలాగే ఏప్రిల్ 28వ తేదీన సెకండ్ లాగ్వేంజ్ ఇంకా ఏప్రిల్ 29 వ తేదీన ఇంగ్లీష్ పరీక్ష ఉండనుంది. అలాగే మే 2 వ తేదీన గణితం ఇంకా మే 4 వ తేదీన సైన్స్ పేపర్ – 1 అలాగే మే 5 వ తేదీన సైన్స్ పేపర్ – 2 ఉండనుంది. అలాగే మే 6 వ తేదీన సోషల్ పరీక్ష కూడా ఉండనుంది. కాగ ఏప్రిల్ 30 తో పాటు మే 1 తేదీల్లో సెలవు దినాలు అనేవి ఉండన్నాయి. అలాగే మే 3 వ తేదీ రంజాన్ ఉండటంతో సెలువు ఉండనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: