ఏపీ సీఎం
జగన్ పేదలకు మరో
గుడ్ న్యూస్ చెప్పారు.. నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం విషయంలో
జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులకు రాయితీపై అదనంగా మరో 50 బస్తాల సిమెంట్ ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ పథకం ద్వారా ఒక్కో ఇంటి నిర్మాణానికి 90 బస్తాల సిమెంట్ ఇస్తోంది. ఒక్కో సిమెంట్ బస్తాను రూ.235-రూ.240 చొప్పున ప్రభుత్వం ఇస్తోంది. అయితే.. మార్కెట్లో బస్తా సిమెంట్ ధర రూ.400కు చేరింది. దీంతో ఎక్కువ సిమెంట్ పేదలు కొనలేకపోతున్నారు. అందువల్ల రాయితీపై మరో 50 బస్తాల సిమెంట్‌ను అదనంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే.. ఈ రాయితీని ఇంటి నిర్మాణ సబ్సిడీ నుంచి మినహాయించాలని
జగన్ ప్రభుత్వం నిర్ణయిచిందిది. ఈ నిర్ణయం వల్ల నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకంలో ఇళ్లు కట్టుకునే పేదలకు తాత్కాలికంగా ఊరట లభించబోతోంది.