ఆర్ఆర్ఆర్.. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టికెట్ రేట్ పెంచుకునేందుకు ఇప్పటికే నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో ఓకే అయినా.. ఏపీలోమాత్రం ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఇలాంటి సమయంలో ఇప్పుడు జగన్ సర్కారు రాజమౌళి టీమ్‌కు గుడ్ న్యూస్ చెప్పేసింది. ఆర్ ఆర్ ఆర్ సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి మంజూరు చేస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.
అన్ని టికెట్ ధరల పైనా అదనంగా 75 రూపాయల మేర వసూలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. సినిమా విడుదల తేది నుంచి 10 రోజుల పాటు పెంచిన ధరలు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో హోంశాఖ పేర్కొంది. ఈమేరకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, పొలీస్ కమిషనర్లు, జేసిలకు జగన్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది.