కీలకం.. హిజాబ్‌ కేసులో ఇవాళే తీర్పు

Chakravarthi Kalyan
కొన్ని రోజుల క్రితం సంచలనం సృష్టించిన హిజాబ్ కేసులో ఇవాళ కర్ణాటక హైకోర్టు తీర్పు వెలువరించనుంది. విద్యా సంస్థల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్‌ ధరించడంపై ఈ కేసు నమోదైంది. హిజాబ్‌ అంశంపై కర్ణాటక హైకోర్టులో కొందరు ముస్లిం విద్యార్థినులు కేసులు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ పూర్తి కాగా.... ఇవాళ తీర్పు వెలువరించనున్నారు. హిజాబ్‌ తీర్పు నేపథ్యంలో కర్ణాటకలోని కొన్ని జిల్లాల్లో విద్యాలయాలకు సెలవులు ప్రకటించారు.

దక్షిణ కర్ణాటకలో విద్యా సంస్థలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. కళాశాలల్లో జరిగే అంతర్గత పరీక్షలను కూడా అధికారులు వాయిదా వేశారు. కొన్ని రోజుల క్రితం కర్ణాటకలో హిజాబ్ వివాదం పెద్ద గొడవలకు దారి తీసింది. ముస్లిం యువతులు హిజాబ్ ధరిస్తే.. తాము కాషాయ కండువాలు ధరించి వస్తామని హిందూ విద్యార్థులు గొడవ చేశారు. ఈ అంశం చివరకు కోర్టుకు ఎక్కింది. దీనిపై కోర్టు తీర్పు ఏం వస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: