అమరావతి రైతుల మాస్టర్‌ ప్లాన్‌.. సుప్రీంలో కేవియట్

Chakravarthi Kalyan
అమరావతి రైతులు ఎలాగైనా తమ రాజధానిని నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. వీరికి అనేక మంది సాయం చేస్తున్నారు. ఇక విపక్ష టీడీపీ ఎలాగూ బహిరంగంగానే మద్దతు ఇస్తోంది. వైసీపీ తప్ప పార్టీలన్నీ ఈ అంశంపై స్పష్టత ఇచ్చాయి. అయితే ఇటీవల ఏపీ హైకోర్టు జగన్ సర్కారుకు షాకింగ్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. రాజధానిని అక్కడి నుంచి తరలించేందుకువీలు లేదని కోర్టు చాలా క్లియర్‌ గా చెప్పింది.


అంతా అంతా జగన్ సుప్రీంకోర్టుకు వెళ్తాడని భావించారు. కానీ.. ఇప్పటి వరకూ ఈ విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన ఉన్నట్టు ప్రకటించలేదు. దీనికి తోడు రైతులు కూడా కొన్నికీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని వ్యాజ్యాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై  సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు.  రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ కు వెళితే తమకు కూడా నోటీసులు ఇవ్వాలని సదరు పిటీషనర్లు డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: