ఆర్టీసీలో మళ్లీ సమ్మె సైరన్‌? సమ్మె తేదీలు ఇవే..?

Chakravarthi Kalyan
తెలంగాణ ఆర్టీసీలో మళ్లీ సమ్మె సైరన్ మోగింది.. సమ్మె నోటీసు ఇవ్వాలని తెలంగాణఆర్టీసీ ఐకాస రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల సాధన కోరుతూ ఆర్టీసీ ఐకాస సమ్మె నోటీసు ఇవ్వబోతోంది. రెండు పే స్కేళ్ల అమలు చేయాలని ప్రధాన డిమాండ్‌గా ఈ సమ్మెకు వెళ్లాలని ఐకాస నిర్ణయించింది. అలాగే డీఏ బకాయిల విడుదల చేయాలన్నది మరో డిమాండ్.. వీటితో పాటు ఎప్పటి నుంచో కోరుతున్న ఉద్యోగ భద్రత కూడా సమ్మె డిమాండ్లలో ఒకటిగా ఉండబోతోంది.
 
అయితే.. ముందుగా నిరసన తెలిపి.. ఆ తర్వాత సమ్మెకు వెళ్లాలని ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నిర్ణయించింది. ఈనెల 13 నుంచి 21 వరకు అన్ని డిపోల్లో కార్మికులతో సమావేశాలు నిర్వహించాలని ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నిర్ణయించింది. కార్మికులతో సమావేశాలు నిర్వహించిన తర్వాత భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస తెలిపింది. సమ్మె నిర్వహణపై ఈనెల 24న ఆన్‌లైన్‌ అభిప్రాయ సేకరణ జరుపుతారు. ఈనెల 28, 29 తేదీల్లో సార్వత్రిక సమ్మె ఉంటుందని ఆర్టీసీ ఐకాస రాష్ట్ర కమిటీ ప్రకటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: