బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌.. ఇవాళే తీర్పు?

Chakravarthi Kalyan
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై ఇవాళ హైకోర్టులో తీర్పు రాబోతోంది. ఈ మధ్యాహ్నం 2.15 గం.కు హైకోర్టు ఉత్తర్వులు వెల్లడించనుంది. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై నిన్న హైకోర్టులో వాదనలు జరిగాయి. సస్పెన్షన్ తీరు అసెంబ్లీ నియమావళికి విరుద్ధమని పిటిషనర్లు వాదించారు. అయితే.. అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదని ఏజీ వాదించారు.

ఈ విషయంలో అసెంబ్లీ కార్యదర్శికి రెండ్రోజుల క్రితం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే.. అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు ఇచ్చేందుకు పిటిషనర్లు, హైకోర్టు రిజిస్ట్రీ ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. నోటీసులు ఇచ్చే ప్రయత్నాలు విఫలమైనట్లు తెలిపిన పిటిషనర్లు, రిజిస్ట్రీ హైకోర్టుకు తెలిపారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోతే.. హైకోర్టు ఎలాంటి చర్య తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సాధారణంగా చట్టసభలు, రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్న వారి నిర్ణయాలపై కోర్టులు పెద్దగా జోక్యం చేసుకోవు. మరి ఈ విషయంలో హైకోర్టు స్పందన ఎలా ఉంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: