సర్కారు వారి పాట : కొత్త పోస్టర్ ఊర మాస్ అంతే..!!

frame సర్కారు వారి పాట : కొత్త పోస్టర్ ఊర మాస్ అంతే..!!

Purushottham Vinay
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట గీత గోవిందం లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత డైరెక్టర్ పరశురామ్ పెట్ల నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. పైగా మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ హీరోతో మొదటి సారి వర్క్ చేస్తుండటంతో.. కాస్త ఆలస్యం అయినా పర్లేదు కానీ అన్నీ విధాలుగా పర్ఫెక్టుగా ప్లాన్ చేసుకుంటున్నాడు దర్శకుడు పరశురామ్. ఇక ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే 60 శాతానికి పైగా పూర్తయింది.


సర్కారు వారి పాట సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఇంకా అలాగే జీఎంబి ఎంటర్ టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మధ్యే విడుదలైన ఫస్ట్ లుక్ ఇంకా అలాగే కళావతి పాటకు అద్భుతమైన స్పందన అనేది వచ్చింది. మరీ ముఖ్యంగా కళావతి పాట అయితే యూ ట్యూబ్‌ను బాగా షేక్ చేస్తుంది. ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా మహా శివరాత్రి సందర్భంగా మాంచి ఊర మాస్ పోస్టర్ ఒకటి విడుదల చేసారు.ఈ పోస్టర్ మహేష్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: