ముంబై: 10 అంతస్తుల అపార్ట్మెంట్లో భారీగా మంటలు?
9 వ అంతస్తులో మంటలు చెలరేగడంతో.. మిగిలిన అంతస్తుల్లోవారు.. హుటాహుటిన భవనం నుంచి బయటకు వచ్చేశారు. ఫైర్ ఇంజిన్ల కష్టపడి మంటలను అదుపు చేస్తున్నాయి. 9, 10 అంతస్తుల్లో ఉన్నవారిని కాపాడేందుకు సహాయక సిబ్బంది తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకైనా మంచిదని అపార్ట్ మెంట్ వాసులను ఖాలీ చేయిస్తున్నారు. ఆస్తి నష్టం జరిగినా ప్రాణ నష్టం జరగకుండా చూసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది.. దీనికి కారణం ఏంటి అనే విషయాలపై ఇంకా స్పష్టత లేదు.