టీడీపీలో విషాదం: సీనియర్ నేత మృతి
మాజీ మంత్రి, మాజీ ఎంపీ యడ్లపాటి వెంకటరావు.. హైదరాబాద్‌లోని కుమార్తె నివాసంలో ఇవాళ కన్నుమూశారు. ఆయన వయస్సు 102 ఏళ్లు.. యడ్లపాటి వెంకటరావుది సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం. దాదాపు 40 ఏళ్ల పాటు రాజకీయాలలో ఆయన క్రియాశీలంగా ఉన్నారు.
1967లో తొలిసారి ఆయన గుంటూరు జిల్లా వేమూరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1978లో యడ్లపాటి వెంకటరావు కాంగ్రెస్‌లో చేరారు. 1978లో వేమూరి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా యడ్లపాటి వెంకటరావు గెలిచారు. ఆ సమయంలోనే మర్రి చెన్నారెడ్డి మంత్రి వర్గంలో ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1983లో ఎన్టీఆర్ టీడీపీ పెట్టడంతో ఆ పార్టీలో యడ్లపాటి వెంకటరావు చేరారు. 1995లో యడ్లపాటి వెంకటరావు గుంటూరు జడ్పీ ఛైర్మన్‌గా పనిచేశారు. 1998లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన యడ్లపాటి వెంకటరావు.. 2004 తర్వాత వయోభారంతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.