దేశం కోసం తుపాకీ పట్టిన మిస్‌ ఉక్రెయిన్ బ్యూటీ..?

Chakravarthi Kalyan
ఉక్రెయిన్‌ దేశంపై రష్యా దాడి కొనసాగుతోంది. అటు ఉక్రెయిన్‌ కూడా రష్యా దాడిని మొండిగా ప్రతిఘటిస్తోంది. చర్చలు ఇంకా ప్రారంభం కాలేదు. అవుతాయన్న నమ్మకం లేదు. ఆయుధాలు వదిలి వస్తేనే చర్చలంటోంది రష్యా. ఇలాంటి సమయంలో మాతృభూమి కోసం చాలా మంది తుపాకులు పడుతున్నారు. అలాంటి వారికి ఏకంగా ప్రభుత్వమే తుపాకీలు సరఫరా చేస్తోంది.

ఇలా చాలా మంది ప్రముఖులు ఇప్పుడు ఉక్రెయిన్‌లో తమ దేశం కోసం ప్రాణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. సొంత గడ్డను  కాపాడుకునేందుకు ఉక్రెయిన్‌లో సామాన్యులు కూడా  తుపాకులు చేతపట్టి కదన రంగంలోకి దూకేస్తున్నారు. ఇక ఇప్పుడు ఉక్రెయిన్ బ్యూటీ క్వీన్ కూడా తుపాకీ పట్టింది. త్వరలో యుద్ధరంగంలోకి దిగుతానంటూ  సోషల్ మీడియాలో ప్రకటించింది.

2015లో మిస్‌గ్రాండ్ ఉక్రెయిన్‌గా ఎంపికైన అనాస్టాసియా లెన్నా కూడా ఇప్పుడు గన్ చేతబట్టుకుంది. యుద్ధంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నానంటూ  ఓ అత్యాధునిక గ‌న్‌తో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాను ఆయుధాలను చేతపట్టడం కొత్తేమీ కాదన్న ఉక్రెయిన్ బ్యూటీ.. తమ దేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఎవరు ప్రయత్నించినా ఊరుకోబోమని హెచ్చరిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: